నాగచైతన్యపై ప్రశంసల వర్షం కురిపించిన అమల అక్కినేని?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా లేటెస్ట్ గా థియేటర్లలో విడుదల అయిన విషయం అందరికి తెలిసిందే. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. విడుదలైన మొదటి రోజే ఊహించని విధంగా కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేసింది.ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ సినిమా పై పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగచైతన్యకు అమలా అక్కినేని శుభాకాంక్షలు తెలిపారు.

నీ లవ్ స్టోరీ కి దర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూ స్ వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరింత పాజిటివ్ టాక్ తో భారీ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ చై అని అమలా అక్కినేని తన ట్విట్టర్ ల పేర్కొంది.ఇప్పటికే ఈ సినిమా చిత్ర బృందం పై సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాపై ప్రిన్స్ మహేష్ బాబు కూడా స్పందించడం జరిగింది.