కృతి శెట్టి బ‌ర్త్‌డే.. సూప‌ర్ ట్రీట్ ఇచ్చిన రామ్‌- నాని!

కృతి శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన `ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన కృతి.. మొద‌టి చిత్రంతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది.

ప్ర‌స్తుతం కృతి నాని స‌ర‌స‌న `శ్యామ్‌ సింగరాయ్‌`, సుధీర్ బాబు స‌ర‌స‌న `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నాగ‌చైత‌న్య స‌ర‌స‌న `బంగార్రాజు`, నితిన్ స‌ర‌స‌న `మాచర్ల నియోజకవర్గం`, రామ్ స‌ర‌స‌న ఓ చిత్రం చేస్తోంది. అయితే నేడు కృతి శెట్టి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆమె ఫ్యాన్స్‌కు రామ్ మ‌రియు నానిలు సూప‌ర్ ట్రీట్ ఇచ్చారు.

SocialNews.XYZ (@SocialNewsXYZ) | Twitter

తాజాగా కృతి శెట్టికి బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతూ శ్యామ్‌ సింగరాయ్ నుంచి ఓ అదిరిపోయే పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. రామ్‌- డైరెక్ట‌ర్ లింగుసామి కాంబోలో తెర‌కెక్కుతున్న మూవీ నుంచి కూడా కృతి శెట్టి బర్త్ డే పోస్టర్ వదిలారు. మ‌రోవైపు సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా త‌రుపున కృతికి బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. దాంతో ఈ రోజంతా కృతి శెట్టి బ‌ర్త్‌డే పోస్టర్లతో సోషల్ మీడియా హీటెక్కిపోతోంది.

Image

Share post:

Popular