జనసేన పార్టీని దూరం పెట్టిన నాగబాబు.. కారణం..?

మెగా బ్రదర్స్ లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు ఆదుకుంటారు అన్న విషయం తెలిసిందే.. ఇకపోతే నాగబాబు అప్పట్లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీకి మద్దతుగా, పార్టీలో కీలక పాత్ర పోషించారు. చిరంజీవి అప్పటికింకా రంగంలోకి దిగకముందే నాగబాబు క్షేత్రస్థాయిలో తిరిగి , అభిమానులను రాజకీయ ప్రయాణానికి ఆయన సిద్ధం చేసిన విషయం ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ప్రజారాజ్యం పార్టీలో ఎలాంటి పదవి ఆశించకపోగా తను చేయాల్సిన పనులు మొత్తం చేశారు.

కానీ కొన్ని అనుకోని కారణాల చేత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేసిన విషయం తెలిసిందే. అప్పుడు తన అన్నయ్య తో విభేదించిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా.. నాగబాబు.. అన్నయ్య ఎటు ఉంటే అటే నా ప్రయాణం అంటూ చెప్పిన విషయం అందరికీ తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టిన తరువాత ఆయన నిర్ణయం మార్చుకుని, తిరిగి తమ్ముడు రాజకీయ పార్టీకి ఎంతో సహాయం చేశారు.

అంతేకాదు జనసేన పార్టీ తరఫున నర్సాపురం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయినప్పటికీ, జనసేన పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు.. ప్రస్తుతం నాగబాబు మళ్లీ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.. ఎందుకంటే గత కొద్ది రోజులుగా జనసేన పార్టీకి సంబంధించిన రాజకీయ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వట్లేదు అనే విషయం కాదు కానీ రాజకీయాలకు మాత్రం ఆయన దూరంగా ఉంటున్నారు..

చాలా రోజుల తర్వాత నాగబాబు సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్ చిట్ చాట్ జరిపారు. ఈ నేపథ్యంలోనే ఒక అభిమాని మీరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారా..? అని అడగడంతో రాజకీయాలకు మాత్రమే దూరంగా ఉంటాను కానీ .. పవన్ కళ్యాణ్ కు మాత్రం ఎప్పుడూ మద్దతు ఇస్తానని తెలిపాడు.. ఇక మరొక అభిమాని మీరు రాజకీయాల్లోకి ప్రవేశించకపోతే ప్రజలకు ఎలా సహాయ పడతారు.? అని అడగగా.. రాజకీయాల్లో ఉంటేనే ప్రజలకు సహాయం చేస్తామా.. లేకపోతే వీలుపడదు.. అరెరే ఈ విషయం నాకు తెలియదే.. అంటూ వ్యంగ్యంగా ప్రస్తావించడంతో.. ప్రతి ఒక్కరు ఇక రాజకీయాలకు, జనసేన పార్టీకి కూడా నాగబాబు దూరం కాబోతున్నాడు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.