పెళ్లి సందD ఫేమ్ శ్రీ లీల అందాల అరబోత.. ఫొటోస్ చూస్తే?

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎంతో మంది హీరోయిన్స్ ని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అంతేకాకుండా హీరోయిన్స్ ని తెరపై రాఘవేంద్రరావు చూపించినంత అందంగా మరే దర్శకుడు కూడా చూపించలేడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

అలాంటి దర్శకుడి ద్వారా పరిచయమైన హీరోయిన్లు స్టార్ హీరోయిన్ లుగా మారి వెండి తెరపై ఒక వెలుగు వెలిగారు. అయితే అతని గోల్డెన్ హ్యాండ్ తో తెలుగు తెరపైకి మరో అందాల బాణాన్ని వదిలారు. ఆమె ఎవరో కాదు శ్రీ లీల.

హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్న పెళ్లి సందD హీరోయిన్. ఈ సినిమా ద్వారా ఈమె తెలుగు తెరకు పరిచయం అవుతోంది.

ఈ సినిమా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందుతోంది. ఈ సినిమాకు గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు,పాటలు,ట్రైలర్ లకు జనాల నుంచి మంచి స్పందన లభించింది.

ఈ సినిమాతో తన అందాలతో కవ్వించింది శ్రీ లీల. ఈమె పెళ్లిసందడి సినిమా కంటే కన్నడ లో కొన్ని సినిమాలు చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో పెళ్లిసందడి సినిమా లో హీరోయిన్ గా ఎంపిక చేశాడు రాఘవేంద్రరావు.

ఇది ఇలా ఉంటే శ్రీ లీల కు సంబంధించిన కొన్ని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటో లో ని బట్టి చూస్తే ఈ సినిమా తర్వాత ఈమె తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకునే చాన్స్ ఉందని కనిపిస్తోంది.