ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సినిమా?

September 20, 2021 at 9:03 pm

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా 24 వ తేదీ విడుదల కానుంది.అయితే హ్యూమన్ రిలేషన్,లవ్ స్టోరీ సినిమాలతో ఆకట్టుకుంటూ వచ్చిన శేఖర్ కమ్ముల, ఈసారి త్రిల్లర్ పై కన్నేశాడు. ఈ సందర్భంగా మీడియా తో సమావేశం అయినా శేఖర్ కమ్ముల తన తరువాత చిత్రాన్ని హీరో ధనుష్ తో తీయబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా విడుదలైంది.

ఈసారి శేఖర్ కమ్ముల తాను ఎలాంటి సినిమా తీయబోతున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. హీరో ధనుష్ తో తీయబోతున్న సినిమా థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇది బహుళ భాషా చిత్రంగా రూపొందనుందని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభం మొదలవుతుందని, ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర సినిమా పథకంపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తారనీ తెలిపారు. ఇక ఈ నెల 24న విడుదల అయ్యే లవ్ స్టోరీ సినిమా ప్రేమ కథ చిత్రం లో కొత్తగా ఉండి అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేశారు శేఖర్ కమ్ముల.

ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సినిమా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts