ప్రస్థానం సినిమాతో 2010లో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ దేవకట్టా. ఇదే సినిమాను బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా వివిధ కోణాలలో సినిమాలు తెరకెక్కిస్తోంది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నాడు. అలా చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. అయితే ప్రస్తుతం పొలిటికల్ జానర్ లో రిపబ్లిక్ సినిమాను తెరకెక్కించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు.అంతేకాకుండా ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో అలరించనుంది.
ఈ సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిపబ్లిక్ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ దేవా కట్టా ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన దగ్గర ఆరు నుంచి ఏడు కథలున్నాయని, అందులో రెండు కథలు చాలా బలమైనది అలాగే ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకుంటాయి అంటూ తెలిపారు. ఆ రెండు కథలను ఎప్పుడెప్పుడు తెరకెక్కిస్తానా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను, కానీ ఒక్కొక్కసారి ఆ సినిమాలో తీయకుండానే చనిపోతానేమో అని భయం కూడా వేస్తోంది అంటూ తెలిపారు. రిపబ్లిక్ సినిమా విడుదలైన తర్వాత మూడు నెలల లోపు ఈ సినిమాను మొదలు పెడతా, రెండు కథలను జనాలకు అందించకపోతే నా జీవితానికి అర్థం లేదని తెలిపారు.