హీరో ధనుష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

September 22, 2021 at 4:31 pm

సినిమాలలో హీరోగా రాణించాలి అంటే కలర్, పర్సనాలిటీ తో సంబంధం లేదని నిరూపించిన హీరో ధనుష్. మొదట ఎంతోమందితో ఎన్నో మాటలు పడిన హీరో ప్రస్తుతం కోలీవుడ్లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. అంతే కాకుండా ఈ హీరో చూడటానికి ఆకట్టుకునే రంగు లేకపోయినా, ఆకర్షించే కటౌట్ అతనిది కాదు. అయినప్పటికీ ఇటు టాలీవుడ్, అది కోలీవుడ్ ఇండస్ట్రీలలో నటించి కోట్లాది మంది ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు హీరో ధనుష్. తనకు నటనపై ఆసక్తి లేనప్పటికీ తన తండ్రి కస్తూరి రాజా కోరికమేరకు సినిమాలలో నటించాడు.

అలా ఇష్టం లేకుండానే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం కోలీవుడ్ లోనే స్టార్ హీరోగా రాణిస్తూ ఉన్నారు. ఇకపోతే ధనుష్ రెమ్యూనరేషన్, ఆస్తుల విషయానికి వస్తే. ధనుష్ ఒక సినిమాకు 10 నుంచి 15 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఈమధ్య శేఖర్ కమ్ముల తో ఒక సినిమా కమిట్ అయ్యాడట. అయితే ఈ సినిమా కోసం ధనుష్ కు దాదాపుగా 50 కోట్లకు పైగా పారితోషికం ఇవ్వ బోతున్నట్లు తెలుస్తోంది. ఆస్తుల విషయానికి వస్తే ఇతని దగ్గర ఐదు ఖరీదైన కార్లు ఉన్నాయి. ఒక్కొక్క కారు విలువ దాదాపుగా నాలుగు కోట్లకు పైనే ఉంటుందట. హీరో ధనుష్ మొత్తం ఆస్తి విలువ దాదాపు 180 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

హీరో ధనుష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts