లోబో నాతో ఆ విధంగా ప్రవర్తించాడు అంటున్న ప్రియాంక సింగ్?

September 22, 2021 at 4:35 pm

బిగ్ బాస్ షో ఇప్పటికే రెండు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని మూడోవారంలో కి అడుగు పెట్టింది. ఇక రోజూ గొడవలు, నవ్వులతో ఈ షో రసవత్తరంగా సాగుతోంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా కంటెస్టెంట్ లు రవి, లహరి, ప్రియా మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు. అలాగే ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ తనతో లోగో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ కాజల్, సిరి దగ్గర వాపోయింది. నిన్న నేను హాప్ పిట్ డ్రెస్ వేసుకున్నాను. అది కొంచెం అన్ కంఫర్టబుల్ గా అనిపించింది. అయినా కూడా వీలైనంత వరకు కవర్ చేసుకుంటూ ఉన్నాను.

అప్పుడు నేను ఏదో మాట్లాడుతూ ఉంటే లోబో నన్ను చూసి సైగలు చేసాడు. లోబో సైగలు చేసిన విషయం నాకు అర్థం అయ్యి నేను కవర్ చేసుకుంటున్నాను. ఇంతలో సడన్ గా వచ్చి నా చెయ్యి పట్టుకున్నాడు. అప్పుడు నేను పన్ని గా తీసుకున్నాను కానీ వెంటనే డ్రెస్ మార్చేసుకున్నాను అని చెబుతూ బాధపడింది. ఇది విని షాక్ అయిన కాజల్ ఇంకోసారి ఇలా చేయకు అని సీరియస్ గా వార్నింగ్ ఇవ్వాల్సింది అని ఆగ్రహించింది. ఇక పక్కనే ఉన్న సిరి ఈ విషయాన్ని రవి కి చెప్తా అనడంతో పింకీ వదిలేయండి అని అంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన లోబో ప్రియాంక కి హాగ్ ఇచ్చి వెళ్ళాడు.

లోబో నాతో ఆ విధంగా ప్రవర్తించాడు అంటున్న ప్రియాంక సింగ్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts