కొత్త ఇల్లు కొన్న దీపికా పదుకొనే.. రేటు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు..?!

September 15, 2021 at 1:49 pm

బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లో దీపికా పదుకొనే ఒకరు. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. 2018లో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ను ప్రేమ వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.

Deepika Padukone and Ranveer Singh buy property in Alibaug; duo spotted at local registrar's office

పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తున్న దీపికా.. తాజాగా ఓ ఖ‌రీదైన ఇంటికి కొనుగోలు చేసింద‌ట‌. అలీబాగ్‌లోని మాప్‌గావ్ అనే గ్రామంలో 9,000 చదరపు మీటర్లు విస్తీర్ణం కలిగి ఉన్న 5 బిహెచ్‌కె (బెడ్‌రూమ్-హౌస్-కిచెన్) ఇల్లు దీపికాకు బాగా న‌చ్చేసింద‌ట‌.

Deepika Padukone, others invest $2.6 mn in pet care platform Supertails

దాంతో వెంట‌నే ఈ ఇంటిని కొనుగోలు చేశార‌ని స‌మాచారం. ఇక ఈ ఇంటి ధ‌ర ఏకంగా రూ .22 కోట్ల అని వార్త‌లు వ‌స్తున్నాయి. కాగా, ప్ర‌స్తుతం ప‌లు బాలీవుడ్ చిత్రాలు చేస్తున్న దీపికా త్వ‌ర‌లోనే టాలీవుడ్‌లోకి కూడా రీ ఎంట్రీ ఇస్తోంది. ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `ప్రాజెక్ట్-కె` లో దీపికా హీరోయ‌న్‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

కొత్త ఇల్లు కొన్న దీపికా పదుకొనే.. రేటు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts