వైరల్: ఈ స్మార్ట్ సన్ గ్లాసెస్ తో..కాల్స్, ఫొటోస్, ట్రాన్స్లేట్ ఇలా ఎన్నో..!

సన్ గ్లాసెస్ తో ఏంటి..? కాల్స్ చేయడం ఏంటి..? అందులోనూ ఫోటోలు కూడా తీస్తారట.. ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా..? నిజమే
.! మొదట మీతో పాటు నాకు కూడా ఆశ్చర్యం తో పాటు సందేహం కూడా కలిగింది.. ప్రముఖ దిగ్గజ మొబైల్ తయారీ సంస్థ షియోమీ అద్దిరిపోయే ఫీచర్లతో ఒక స్మార్ట్ సన్ గ్లాసెస్ ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే వీటి ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

షియోమీ విడుదల చేసే సన్ గ్లాసెస్ సెన్సార్ లతో వర్క్ అవుతాయట.. ఇమేజ్ సిస్టంతో స్మార్ట్ ఫీచర్లను కూడా ఎనేబుల్ చేసే కెపాసిటీ ఈ గ్లాసెస్ కు వుంది..కేవలం 51 గ్రాములు మాత్రమే ఈ స్మార్ట్ గ్లాసెస్ బరువు కలిగి ఉంటాయి.. వీటిలో మైక్రో ఎల్ఈడి ఆప్టికల్ వేవ్ గైడ్ టెక్నాలజీని పొందుపరిచినట్లు సమాచారం. అంతేకాదు ఈ స్మార్ట్ గ్లాస్ ను ఉపయోగించి కాల్స్ కూడా చేయవచ్చు.. ఫోటోలు కూడా తీయవచ్చు .నావిగేషన్ ని సెట్ చేసుకోవచ్చు.. మన కళ్ళ ముందు ఉన్న టెక్స్ట్ ను కూడా ట్రాన్స్లేట్ చేసే ఫీచర్ కూడా ఇందులో కల్పించబడింది..

Xiaomi Smart Glasses: Xiaomi unveils its first Smart Glasses with live  translation, navigation support - Times of India
ఈ స్మార్ట్ గ్లాసెస్ లో ఫైవ్ ఎంపీ కెమెరాలు కూడా ఇంటిగ్రేట్ చేశారు.. అంతేకాదు ఆండ్రాయిడ్ ఓఎస్ తో ఇవి పని చేస్తాయి. టచ్ పాడ్ , బ్లూటూత్ ,వైఫై లాంటి ఎన్నో ఫీచర్లు ఈ గ్లాసెస్ లో చేర్చబడ్డాయి. కానీ ఈ గ్లాసెస్ ను ఎప్పుడు విడుదల చేస్తారు చెప్పడంలేదు.