హిట్ కొట్టిన ఆ డైరెక్ట‌ర్‌కి వ‌ర‌మిచ్చిన చిరంజీవి..ఇప్పుడిదే హాట్ టాపిక్‌!

September 13, 2021 at 7:16 pm

డైరెక్ట‌ర్ సంపత్ నంది గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఏమైంది ఈవేళ` సినిమాతో డైరెక్ట‌ర్‌గా తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన సంప‌త్ నంది.. రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద వంటి చిత్రాల‌తో బాగానే ఆక‌ట్టుకున్నాడు. తాజాగా గోపీచంద్‌తో `సీటీమార్‌`ను తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు.

Sampath Nandi talks about his dream to direct Chiranjeevi - Tollywood.Net English | DailyHunt

అయితే హిట్ కొట్టిన ఈ డైరెక్ట‌ర్‌కు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే వ‌ర‌మిచ్చార‌ట‌. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ట‌. అవును, ఇప్పుడు ఈ విష‌య‌మే నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌స్తుతం సంప‌త్ చిరు కోసం ఓ అద్భుమైన క‌థ‌ను రెడీ చేసే ప‌నిలో ఉన్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Sampath Nandi To Direct Chiru? - Sampath Nandi Chiranjeevi

ఒక‌వేళ చిరును క‌థ ఇంప్రెస్ చేసిన‌ట్టైతే సంప‌త్ నంది జాక్ పాట్ కొట్టేసిన‌ట్టేన‌ని టాక్ న‌డుస్తోంది. కాగా, కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య‌ను ఫినిష్ చేసిన చిరు.. ఇప్పుడు మోహ‌న్‌రాజా డైరెక్ష‌న్‌లో గాడ్‌ఫాదర్, మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ష‌న్‌లో భోళాశంకర్ మ‌రియు బాబీ డైరెక్ష‌న్‌లో ఓ చిత్రం చేస్తున్నారు. సంప‌త్ క‌థ న‌చ్చితే.. ఈ చిత్రాల త‌ర్వాత ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంటుంది.

హిట్ కొట్టిన ఆ డైరెక్ట‌ర్‌కి వ‌ర‌మిచ్చిన చిరంజీవి..ఇప్పుడిదే హాట్ టాపిక్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts