`రిప‌బ్లిక్‌`లో త‌న పాత్రేంటో లీక్ చేసేసిన ఐశ్వర్య రాజేష్!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌, తెలుగ‌మ్మాయి ఐశ్వ‌ర్య రాజేష్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రిప‌బ్లిక్‌`. దేవ కట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.భగవాన్, జె. పుల్లారావు క‌లిసి నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుము ఈ చిత్రం అక్టోబ‌ర్ 1న విడుద‌ల కాబోతోంది.

Republic Movie: Sai Dharam Tej stuns in latest trailer, fans can't keep  calm | IWMBuzz

ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఐశ్వ‌ర్య రాజేష్‌.. ఎన్నో విష‌యాల‌ను పంచుకుంది. ఈ క్ర‌మంలోనే రిప‌బ్లిక్‌లో త‌న పాత్రేంటో కూడా లీక్ చేసేసింది. ఐశ్వర్య మాట్లాడుతూ.. `రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నించే ఐఏఎస్ అధికారి కథ ఇది.

Republic teaser: Sai Dharam Tej promises a gripping actioner that questions  ruling elite | Entertainment News,The Indian Express

ఈ చిత్రంలో మైరా అనే ఎన్ఆర్ఐ అమ్మాయిగా నేను కనిపిస్తాను. తనకు ఎదురైన ఓ సమస్యకు పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తూ.. స్వదేశానికి వచ్చిన ఆమె ఎలాంటి సంఘటనలు ఎదుర్కోంది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రొటీన్‌గా సాంగ్స్‌ పాడుకునేలా ఇందులో హీరో, హీరోయిన్‌ మధ్య లవ్‌ట్రాక్‌ ఉండదు. మెచ్యూర్డ్‌గా కనిపిస్తుంది. సినిమాలో లవ్‌ ప్రపోజ్‌ చేసే సీన్‌ కూడా ఉండదు.` అంటూ చెప్పుకొచ్చింది.