సైకిల్‌పై దూసుకుపోతున్న‌ స‌మంత‌..నెట్టింట వీడియో వైర‌ల్‌!

అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా భ‌ర్త నాగ చైత‌న్య నుంచి స‌మంత విడాకులు తీసుకోబోతోంద‌నే వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో.. ఆమె ఏం చేసినా, ఎక్క‌డ‌కు వెళ్లినా, ఏ పోస్ట్ పెట్టిన తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Samantha Akkineni on 'The Family Man' Season 2 and breaking the rules with  OTT | The News Minute

ఇదిలా ఉంటే.. ఆ మ‌ధ్య చైతు లేకుండానే స‌మంత ఫ్రెండ్స్‌తో గోవా టూర్‌కు వెళ్లి మ‌స్తు ఎంజాయ్ చేసింది. అయితే గోవాలో స‌మంత త‌న స్నేహితుల‌తో క‌లిసి సైకిల్ రైడింగ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా త‌న ఇన్‌స్టాగ్ర‌మ్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంది.

Samantha Akkineni Has a Gala Time as She Goes Cycling With Friends - The  Urban Press

ఈ వీడియోలో ఓవైపు వ‌ర్షం, మ‌రోవైపు మనోహరమైన ప్రకృతి మధ్య సమంత సైకిల్‌పై దూసుకుపోతూ క‌నిపించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇక స‌మంత సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈ భామ గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శకుంతలం సినిమాలో న‌టించింది. అలాగే మ‌రిన్ని ప్రాజెక్ట్స్ కూడా ఈమె చేతిలో ఉన్నాయి.

https://youtu.be/ZRjAPqcUiB8