అద‌ర‌హో అనిపిస్తున్న `వరుడు కావలెను’ టీజర్..!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య‌, రీతు వ‌ర్మ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌రుడు కావ‌లెను`. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మురళీశర్మ, నదియా, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

నాగ శౌర్య వరుడు కావలెను టీజర్ ట్రీట్ రెడీ..

ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, పాటలకు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా మేక‌ర్స్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఎవరూ కనెక్ట్ అవడం లేదంటూ ముప్పై ఏళ్ళు వచ్చినా అబ్బాయిలను రిజెక్ట్ చేసే నేటితరం అమ్మాయిగా రీతూ వర్మని టీజ‌ర్‌లో చూపించ‌గా.. ఆమె అందం, పొగ‌రు న‌చ్చి పెళ్లి చేసుకోవాల‌నుకునే అబ్బాయిగా శౌర్య క‌నిపించాడు.

Varudu Kaavalenu: టామ్‌ అండ్‌ జెర్రీలా ఉన్న వీరు ప్రేమలో ఎలా పడ్డారబ్బా.?  ఆకట్టుకుంటోన్న వరుడు కావలెను టీజర్‌. | Naga Shaurya Ritu Varma Varudu  Kaavalenu Movie Teaser Released ...

మ‌రి ఈ హ్యాండ్సమ్ అబ్బాయి ప్రేమ‌లో ఆ టిపికల్ అమ్మాయి ప‌డింది..? అత‌డిని పెళ్లి చేసుకుందా..? లేదా..? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక టీజ‌ర్‌లో శౌర్య‌, రీతు ఎంతో అందంగా క‌నిపించారు. డైలాగ్స్‌, విజువ‌ల్స్‌, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వంటివి ఆక‌ట్టుకున్నాయి. మొత్తానికి అద‌ర‌హో అనిపిస్తున్న టీజ‌ర్ మాత్రం సినిమా భారీ అంచ‌నాల‌ను పెంచేసింది.

Share post:

Popular