రజనీకాంత్ కూడా పరిష్కరించలేని సమస్య తెచ్చుకున్న వనిత విజయ్ కుమార్.. ఆ తర్వాత…?

వనిత విజయకుమార్  ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వనిత. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వనిత విజయకుమార్ ని కాంట్రవర్సి క్వీన్ గా కూడా పిలుస్తుంటారు. ఈ మధ్య కాలంలోనే ఈమె తన పెళ్లి విషయంలో హైలెట్ గా నిలిచింది. అలాగే విజయ్ కుమార్ తో ప్రాపర్టీ విషయంలో కూడా ఈమె హైలెట్ అయ్యింది. అయితే వనిత విజయ్ కుమార్ మొదట లవ్ మ్యారేజ్ చేసుకొని తన తల్లిదండ్రుల నుంచి విడిపోయి బయటికి వెళ్లి పోయింది. ఆ తరువాత తన తల్లి మంజుల మరణం తర్వాత విజయ్ కుమార్ తన ఫ్యామిలీకి చెందిన ప్రాపర్టీ విషయంలో ఈమె ఫైట్ చేసి మీడియాలో హైలెట్ అయ్యింది.

అయితే ఇటీవల ఆమె ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షో కి వచ్చి పలు విషయాలను వెల్లడించింది. తన ఫ్యామిలీ తో ప్రాపర్టీ విషయంలో గొడవ పడినప్పుడు ఆ విషయంపై సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూడా మాట్లాడినట్లు ఆమె తెలిపింది. ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకుని తన పిల్లలతో నిలువలేని నీడలో ఉన్న సమయంలో తన తండ్రి దగ్గర నుంచి ఆస్తుల తన వాటాను అడిగిందట, రజనీకాంత్ తన తండ్రికి చాలా క్లోజ్ అని, రజనీకాంత్ ను అంకుల్ అని పిలుస్తామని, అంతే కాకుండా అతను తల్లి అంటే రజనీకాంత్ కు ఇష్టమని తెలిపింది. రజనీకాంత్ కూడా వనిత విజయ్ కుమార్ కు రావలసిన ప్రాపర్టీ విషయంలో తన తండ్రి తో మాట్లాడిన కూడా పని జరగలేదు అంటూ అందుకే ఆ ప్రాపర్టీ విషయంలో తాను లైట్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది వనిత విజయకుమార్.

Share post:

Popular