బిగ్‌బాస్ 5లో క‌ల‌క‌లం రేపిన క‌రోనా..ఇద్ద‌రికి పాజిటివ్‌..?

August 28, 2021 at 6:48 pm

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 సెప్టెంబ‌ర్ 5 నుండి ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సారి కూడా కింగ్ నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ షోలో పాల్గొనే కంటెస్టంట్ లను ఫైనల్ చేయ‌గా.. ఆగష్టు 26 నుండి వారంద‌రూ హైదరాబాద్ ఐటీసీ హోటల్‌లో క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

Bigg Boss Telugu Season 5 promo out. Watch video - Television News

అయితే ఇలాంటి త‌రుణంలో ఓ షాకింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. మాయ‌దారి క‌రోనా వైర‌స్ బిగ్ బాస్ 5లో క‌ల‌క‌లం రేపిన‌ట్టు తెలుస్తోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఇద్దరు కంటెస్టెంట్స్‌కు తాజాగా కరోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Bigg Boss Contestants : బిగ్‌బాస్ సీజ‌న్‌ 5 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్? | Bigg  Boss Season 5 Telugu Contestants List?

ఆ కంటెస్టెంట్స్ ఎవ‌ర‌న్న‌ది తెలియ‌క‌పోయినా.. సోష‌ల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ వైర‌ల్‌గా మారింది. కాగా, షో ప్రారంభ తేది దగ్గర పడుతుండడంతో కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొందమంది పేర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతుండ‌గా.. వారిలో యూట్యూబ్ స్టార్లే ఎక్కువ‌గా ఉన్నారు.

బిగ్‌బాస్ 5లో క‌ల‌క‌లం రేపిన క‌రోనా..ఇద్ద‌రికి పాజిటివ్‌..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts