మంచు మనోజ్ కొత్త బిజినెస్.. ఏమిటంటే?

August 21, 2021 at 1:35 pm

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇటు సినిమాలతోపాటు అటు బిజినెస్ రంగాల వైపు కూడా మొగ్గుచూపుతున్నారు. హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్లు కూడా బిజినెస్ రంగాలలో అడుగులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే మంచు మనోజ్ కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ గురించి మనందరికీ తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తనదైన శైలిలో నటించి తన కంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.

ఇకపై మంచు మనోజ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో వెంచర్ లను స్టార్ట్ చేసినట్లు తెలిపాడు. అలాగే వీలైనంత త్వరలో చాలా మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నాడు. ఈ విషయంపై త్వరలోనే మరింత సమాచారం అధికారికంగా ప్రకటన చేయనున్నాడు మంచు మనోజ్. అయితే ఇటీవలే తన సోదరి మంచు లక్ష్మితో కలిసి చాలా రోజుల తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు మంచు మనోజ్.

మంచు మనోజ్ కొత్త బిజినెస్.. ఏమిటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts