రూ. 200 కోట్లు ఇచ్చినా మ‌హేష్ ఆ ప‌ని చేయ‌డంటున్న సుధీర్ బాబు!!

August 29, 2021 at 8:39 am

సుధీర్ బాబు, ఆనంది జంట‌గా న‌టించిన తాజా చిత్రం `శ్రీ‌దేవి సోడా సెంట‌ర్‌`. ప‌లాస 1978 డైరెక్టర్‌ కరుణకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకోగా.. సినీ ప్ర‌ముఖులు సైతం మంచి రివ్యూ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలోనే శనివారం హైద్రాబాద్‌లో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

Sudheer Babu's 'Sridevi Soda Center' release date announced | Telugu Movie  News - Times of India

ఈ కార్య‌క్ర‌మంలో సుధీర్ బాబు మాట్లాడుతూ..మంచి కంటెంట్ ఉన్న సినిమాను తీశాము. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి సూరిబాబు, శ్రీదేవి పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పటి వరకు ఈ సినిమా చూసిన ఎవ్వరూ సినిమా బాలేదని చెప్పలేదు. మహేష్, ప్రశాంత్ నీల్, రానా, నిహారిక కొణిదెల గార్లు సినిమా బాగుందని ట్వీట్ చేశారు.

Sudheer Babu is absolutely brilliant

మహేష్ బాబు అనే వ్యక్తిని బెదిరించినా లేక రూ. 200 కోట్లు ఇచ్చినా కూడా తన కెరియర్‌లో తను నమ్మందే ఏది చేయడు. ఈ సినిమాకు తను పంపిన ట్వీట్‌లో ఎవరెవరు ఏం చేశారు అనేది క్లియర్‌గా చెప్పాడు. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. నచ్చితే పదిమందికి తెలియజేయండి. ఫ్యామిలీ అందరూ కలసి వచ్చి ఈ సినిమా చూడండి` అంటూ చెప్పుకొచ్చాడు.

 

రూ. 200 కోట్లు ఇచ్చినా మ‌హేష్ ఆ ప‌ని చేయ‌డంటున్న సుధీర్ బాబు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts