ప్ర‌భాస్ ఇంటికి వెళ్తే అవ‌న్నీ గ‌ల్లంతే అంటున్న సుధీర్ బాబు!!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంట‌ర్`. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా న‌టించింది. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. దాంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ షురూ చేసింది.

Glimpse Of Lighting Sooribabu | Sridevi Soda Center | Sudheer Babu |  Manisharma | 70mmEntertainments - YouTube

ఈ నేప‌థ్యంలోనే సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు పాన్ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో ఇంట‌ర్వ్యూ ప్లాన్ చేశారు మేక‌ర్స్. తాజాగా ఆ ఇంటర్వ్యూ టీజర్ కూడా రిలీజయింది. ఇందులో ప్ర‌భాస్ గురించి సుధీర్ బాబు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి. సుధీర్ బాబు మాట్లాడుతూ.. మొన్న ప్రభాస్ ఇంటికి వెళ్ళాను.

Prabhas Height, Girlfriend, Caste, Family, Net worth, Biography & More -  BigstarBio

రుచిక‌ర‌మైన ఫుడ్ పెట్టాడు. వారంలో ఒక్కరోజు ప్రభాస్ ఇంటికి వెళితే చాలు. వ‌ర్క‌వుట్ ప్లాన్స్, సిక్స్ ప్యాక్ లు ఏమీ ఉండవు.. అన్నీ గల్లంతే అవుతాయ‌ని సరదాగా కామెంట్ చేశాడు. కాగా, ప్ర‌భాస్ ఆతిథ్యం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్రభాస్‌ను ఎంతలా ఇష్టపడతారో, అతడు పెట్టే భోజనాన్ని కూడా అంతే ఇష్టపడతారు. అందుకే ఆయ‌న గురించి ఎవ్వ‌రు మాట్లాడినా ముందుగా చెప్పే విషయం ఫుడ్ గురించే. నోరూరించే మెనూతో నోట మాట రానివ్వకుండా చేయడం ప్రభాస్ స్పెషాలిటీ.

 

Share post:

Latest