మేఘ ఆకాశ్‌పై మ‌న‌సు పారేసుకున్న వ‌ర్మ‌..స్టేజ్‌పైనే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో హిట్ సినిమాల‌ను ఇండ‌స్ట్రీకి అందించిన వ‌ర్మ‌.. ఇప్పుడు ఎవ‌రికి న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా ఏదో ఒక సినిమా తీస్తూ వ‌రుస ఫ్లాపుల‌ను మూట‌క‌ట్టుకుంటున్నారు. సినిమాల‌ విష‌యం ప‌క్క‌న పెడితే.. ఎప్పుడూ ముక్కుసూటి త‌నంగా వ్య‌వ‌హ‌రించే వ‌ర్మ అంద‌మైన అమ్మాయి క‌నిపిస్తే చాలు హ‌ద్దులు దాటేస్తుంటాడు.

Megha Akash - Wikipedia

ఇక తాజాగా యంగ్ హీరోయిన్ మేఘ ఆకాశ్‌పై మ‌న‌సు పారేసుకున్న వ‌ర్మ స్టేజ్‌పైనే ఆమె గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మేఘా ఆకాష్‌, అరుణ్‌ అదిత్‌, అర్జున్‌ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్‌ మేఘ’. సుశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. అర్జున్‌ దాస్యన్‌ నిర్మించారు. సెప్టెంబ‌ర్ 3న ఈ మూవీ విడుద‌ల కాబోతోంది.

Dear Megha Movie (2021) Cast | Trailer | Songs | Release Date - News Bugz

ఈ క్రమంలోనే తాజాగా ‘డియర్‌ మేఘ’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్ నిర్వ‌హించ‌గా.. ఈ ఈవెంట్‌కు రామ్ గోపాల్ వ‌ర్మ స్పెష‌ల్ గెస్ట్ గా విచ్చేశారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో వ‌ర్మ స్టేజ్‌పై మాట్లాడుతూ మేఘా ఆకాశ్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆయ‌న మాట్లాడుతూ.. `40 ఏళ్ల క్రితం నాకు ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే, నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. మేఘ చాలా స్వీట్‌గా ఉంటుందని, తనని కలిసిన వారికి డయాబెటిస్‌ వస్తుందని నా అభిప్రాయం` అంటూ ఆమెపై పొగడ్త‌ల వ‌ర్షం కురిపించారు. దాంతో వ‌ర్మ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Share post:

Popular