ర‌కుల్‌కి బ‌న్నీ బంప‌ర్ ఆఫ‌ర్‌..ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం పుష్ప మొద‌టి భగానికి సంబంధించిన షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతుంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత బ‌న్నీ ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌బోతున్నాడ‌ని ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Conditions Apply: Parasuram next with Allu Arjun - tollywood

గీత గోవిందం సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన దగ్గర నుంచి గీతా ఆర్ట్స్‌‌తో పరశురామ్‌కి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యంతోనే బ‌న్నీ, ప‌రుశురామ్ కాంబోలో ఓ చిత్రాన్ని రూపొందించే దిశ‌గా గీతా ఆర్ట్స్ అడుగులు వేస్తున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పుడు మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Rakul Preet Singh takes 50% pay cut in salary to compensate producers'  losses? | Telugu Movie News - Times of India

ఈ చిత్రంలో బ‌న్నీకు జోడీగా న‌టించే బంప‌ర్ ఆఫ‌ర్‌ను ఢిల్లీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ కొట్టేసింద‌ట‌. ప్ర‌స్తుతం బాలీవుడ్ సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ర‌కుల్ బ‌న్నీ సినిమా నుంచి పిలుపు రాగానే ఓకే చెప్పింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో వ‌చ్చిన స‌రైనోడు చిత్రంలో బ‌న్నీ స‌ర‌స‌న ర‌కుల్‌నే న‌టించింది. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ చేయాలని చూస్తున్నార‌ని టాక్‌. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే అధికార‌క ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

 

Share post:

Popular