`ఆర్ఆర్ఆర్‌` హీరోల‌పై రాజ‌మౌళి సీరియ‌స్‌..కార‌ణం ఏంటీ?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌. అలియా భట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీంగా ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు.

Rajamouli's RRR gets a release date | Entertainment News,The Indian Express

ప్ర‌స్తుతం ఈ సినిమా ఆఖ‌రి షెడ్యూల్ ఉక్రెయిన్‌లో జ‌రుగుతుండ‌గా.. అక్డోబ‌ర్ 13న గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. అయితే విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో.. రాజ‌మౌళి భారీగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హించాల‌ని ప్లాన్లు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే హీరోల‌తో స‌హా సినిమాలోని న‌టీన‌టులంద‌రికీ మ‌రియు టెక్నీషియన్ల‌కు రాజ‌మౌళి సీరియ‌స్‌గా వార్నింగ్ ఇచ్చార‌ట‌.

Vijayendra Prasad addresses RRR controversies, says SS Rajamouli film 'cannot be compared to Baahubali' | Entertainment News,The Indian Express

అనుమ‌తి లేకుండా ఎవ‌రూ మీడియాతో మాట్లాడ‌వ‌ద్ద‌ని.. ఒకవేళ మాట్లాడాల్సి వ‌చ్చినా సినిమాకి సంబంధించి ఎలాంటి విషయాలు బ‌య‌ట‌పెట్ట‌కూడ‌ద‌ని రాజ‌మౌళి సూచించార‌ట‌. చిన్న ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళినా.. ఆ త‌ర్వాత ప‌రిణామాలు వేరే విధంగా ఉంటాయ‌ని ముందే చెప్పేశార‌ట‌. ఇక రాజమౌళి నుంచి నేరుగా సూచనలు రావడంతో అటు స్టార్ నటీనటులుకుగానీ ఇటు టెక్నీషియన్స్ కుగానీ నోరుమెదిపే ప‌రిస్థితి లేకుండా పోయింది.

 

Share post:

Latest