పూజా హెగ్డేని తీవ్రంగా విమర్శించిన ఆర్కేరోజా భర్త..!

పూజా హెగ్డేపై ఆర్కే సెల్వమణి తీవ్ర విమర్శలు చేశారు. దర్శకుడిగా చాలా తమిళ్ సినిమాలు చేసిన సెల్వమణి గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అగ్రతార పూజా హెగ్డే తీరును ఆయన తప్పుబట్టారు. “పూజా హెగ్డే తన కెరీర్ తొలినాళ్లలో కేవలం ఒకే ఒక్క పర్సనల్ అసిస్టెంట్ తో వచ్చేవారు. కానీ స్టార్ డమ్ వచ్చిన తర్వాత ఆమె 12 మంది అసిస్టెంట్లను షూటింగ్ లొకేషన్ కు తీసుకొస్తున్నారు. దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయి నిర్మాత పై చాలా ఆర్థిక భారం పడుతుంది,” అని ఆయన విమర్శించారు.

ఇదిలా ఉండగా పూజా హెగ్డే ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్, బీస్ట్, భాయిజాన్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె తన ప్రస్తుత సినిమాలకు రూ.2.5 నుంచి రూ.3కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారని సమాచారం. సెల్వమణి వైసీపీ ఎమ్మెల్యే, సీనియర్ నటి రోజాకు భర్త అవుతారనే విషయం తెలిసిందే.