ఒటీటీలో విడుదల తేదీని ప్రకటించిన.. నితిన్ మాస్ట్రో..?

టాలీవుడ్ లో యంగ్ హీరోల లో నితిన్ కూడా ఒకరు. ఈయన జయం సినిమాతో మంచి సక్సెస్ను అందుకోగా.. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ కొన్ని హిట్ సినిమాలను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో ఫ్లాప్ లను చవిచూశాడు. ఇక ఇష్క్ సినిమాతో వరుసగా యాక్టర్ హిట్లు సాధించాడు. ఇక ప్రస్తుత నితిన్ నటించిన మస్త్రో మూవీ త్వరలో మన ముందుకు రాబోతోంది ఆ విశేషాలను చూద్దాం.

 

నితిన్ కి ఇది 30 వ చిత్రం ఈ చిత్రాన్ని థియేటర్ లో విడుదల చేయాలనుకున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. కానీ కరోనా కారణంగా ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయకుండా డైరెక్టుగా ఓటీటి లో విడుదల చేస్తున్నారు.ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో మాస్ట్రో డీల్ కుదుర్చుకుంది.తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారు. మాస్ట్రో చిత్రాన్ని సెప్టెంబర్ 17న హాట్ స్టార్ లో విడుదల కాబోతోంది.

Maestro OTT Release Date Fix

హిందీలో ఈ సినిమాని “అంధాదున్”చిత్రంగా తెరకెక్కించారు. ఇక తెలుగులో రీమిక్స్ మాస్ట్రో గా విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కూడా నితిన్ ఆంధుడిగా కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్ నటిస్తున్నది.ఈ సినిమాలో కీలకమైన పాత్రలో.. మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది.