అర‌రే..ఎన్టీఆర్ వ‌ల్ల నాగ్‌కు పెద్ద స‌మ‌స్యే వ‌చ్చిందిగా..?!

August 4, 2021 at 5:26 pm

ఎన్టీఆర్ వ‌ల్ల నాగార్జున‌కు స‌మ‌స్య రావ‌డం ఏంటీ..? అస‌లు ఏం జ‌రిగింది..? అన్న సందేహాలు టైటిల్ చూడ‌గానే మీకు వ‌చ్చే ఉంటాయి. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటో తెలియాలంటే.. లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ఓవైపు సినిమాల‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ త్వ‌ర‌లోనే బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

NTR to host Gemini TV's 'Evaru Meelo Koteeswarulu' | Indian Television Dot  Com

జెమిని టీవీలో ప్ర‌సారం కానున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నెల‌లోనే ఈ షో స్టార్ట్ కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, ప్రోమోలు అద్భుతంగా ఆక‌ట్టుకోగా.. నంద‌మూరి అభిమానులు, బుల్లితెర ప్రేక్ష‌కులు ఈ షో ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Bigg Boss 5 Telugu: Nagarjuna reality show postponed? - tollywood

ఇదిలా ఉంటే.. మ‌రోవైపు నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న బిగ్ బాస్ సీజ‌న్ 5 కూడా త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. అంటే అటు ఎన్టీఆర్ షో, ఇటు నాగ్ షో దాదాపుగా ఒకే స‌మ‌యంలో ప్ర‌సారం అవ్వ‌బోతున్నాయి. ఇదే జ‌రిగితే.. ఖ‌చ్చితంగా టీఆర్పీ విషయంలో ఆయా ప్రోగ్రామ్స్ నిర్వాహకులకు షాక్ త‌గ‌ల‌నుంది. అయితే నాగార్జున‌తో పోలిస్తే.. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌కే ఫాలోంగ్ ఎక్కువ‌గా ఉంది. ఈ లెక్క‌న‌ నాగ్ షో పైనే టీఆర్పీ ఎఫెక్ట్ ఎక్కువ‌గా ప‌డ‌నుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

 

అర‌రే..ఎన్టీఆర్ వ‌ల్ల నాగ్‌కు పెద్ద స‌మ‌స్యే వ‌చ్చిందిగా..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts