సూప‌ర్ కామెడీగా `101 జిల్లాల అందగాడు` ట్రైల‌ర్‌!

అవసరాల శ్రీనివాస్ కీల‌క పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `101 జిల్లాల అందగాడు`. ఈ సినిమా ద్వారా రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతుండ‌గా..చిలసౌ. ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్లమూడి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 3న థియేట‌ర్‌లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మేక‌ర్స్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. చిన్న వ‌య‌సులోనే వార‌స‌త్వంగా బ‌ట్ట‌త‌ల రావ‌డంతో ఓ యువ‌కుడు ఎటువంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటాడు.. దొర‌క్క దొర‌క్క దిరికిన ప్రేయ‌సి ద‌గ్గ‌ర త‌న‌ బ‌ట్ట‌తల విష‌యాన్ని దాచి పెట్టేందుకు ఎలాంటి తిప్ప‌లు ప‌డ్డాడు..చివ‌ర‌కు అత‌డు త‌న ప్రేమ‌లో స‌క్సెస్ అయ్యాడా.. లేదా..? వంటి అంశాల‌తో ఈ సినిమా తెర‌కెక్కింద‌ని ట్రైల‌ర్ బ‌ట్టీ స్ప‌ష్టంగా అర్థం అవుతోంది.

సూప‌ర్ కామెడీగానే కాకుండా ఎమోష‌న‌ల్‌గా కూడా ఉన్న ఈ ట్రైల‌ర్ ఆధ్యంతం ఆక‌ట్టుకుంటోంది. మ‌రియు సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ బట్టతలతో కనిపించే గొత్తి సత్యనారాయణగా అలరించనున్నారు. ఆయ‌న ప్రేయ‌సిగా రుహానీ న‌టిస్తోంది.