పవన్ కళ్యాణ్ ట్విట్టర్ కు ఎందుకు దూరమయ్యాడో.. కారణం..?

August 25, 2021 at 11:19 am

మన మెగా ఫ్యామిలీ లో అందరికీ ఫాలోయింగ్ ఎక్కువే అందులో పవన్ కళ్యాణ్ కి వేల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ చాలా మూవీస్ లో బిజీగా ఉన్నారు. తమిళ్ మూవీ అయ్యప్పనుమ్, కోషి యుమ్ రీమిక్స్ షూటింగ్ ను త్వరగా పూర్తి చేయాలని తర్వాత హరి హర వీరమళ్లు షూటింగ్ కి వెళ్లాలని పవన్ భావిస్తున్నారట.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నారు. హిస్టారికల్ గా పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై పెద్ద అంచనాలు వెలువడుతున్నాయి. పవన్ కళ్యాణ్ కొద్ది నెలలుగా పర్సనల్ ట్విట్టర్ లో కనిపించడం లేదు.

పవన్ కళ్యాణ్ కు పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. దాదాపు 4.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ తన ట్విటర్లో ఈ ఏడాది జనవరి నెల 12 తేదీన వివేకానంద జయంతి సందర్భంగా పోస్టు పెట్టాడు. జనసేన పార్టీని మార్చి 29న స్టార్ట్ చేశాడు. తిరుపతి పార్లమెంట్ కాన్ఫరెన్స్ కు సంబంధించిన విషయాలకు ట్విట్టర్లో ఓపెన్ చేశారు.

తన జనసేన ఖాతా కోసం ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేశాడు. మరియు జనసేన ఖాతానుండి మెగాస్టార్ చిరంజీవి గారికి బర్త్ డే విషెస్ పంపించారు . కొన్ని సినిమాలు తీయటం తో బిజీగా ఉండటం వలన ఐదు నెలల నుంచి ట్విట్టర్ కు దూరం అయిపోయారు. అందుకని అభిమానులలో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ కు దూరం అయినట్లేనా అని వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్ ప్రజా జీవితం లోకి రావటానికి జనసేన ఖాతా ను,ఎక్కువ వినియోగించుకుంటున్నారని ఈ ఖాతాకు ఫాలోవర్స్ సంఖ్య పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. వచ్చే కాలంలో పవన్ కళ్యాణ్ పర్సనల్ ఖాతాని వినియోగిస్తాడో..? లేదో..? తెలియాలంటే వేచి ఉండాల్సిందే

పవన్ కళ్యాణ్ ట్విట్టర్ కు ఎందుకు దూరమయ్యాడో.. కారణం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts