చిరు ఇంట పీవీ సింధుకు సన్మానం..సంద‌డి చేసిన సినీ తార‌లు!

టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఘనంగా సన్మానించారు. ఆగ‌ష్టు 20వ తేదీనా సింధును చిరంజీవి హైదరాబాదులోని తన నివాసానికి ఆహ్వానించారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య సింధును సత్కరించారు.

Chiranjeevi shares Sindhu's felicitation with delight

ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతుండ‌గా.. తాజాగా `దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన మన పీవీ.సింధు ని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చింది..` అని తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోను ఇన్‌స్టాగ్రమ్ వేదికగా షేర్ చేశారు.

Watch: Chiru Hosted A Party For PV Sindhu -

ప్ర‌స్తుతం చిరు షేర్ చేసిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇక ఈ వేడుకలో మెగాస్టార్ ఫ్యామిలీ సభ్యులందరితో పాటు, కింగ్ నాగార్జున ఫ్యామిలీ, అల్లు అరవింద్ ఫ్యామిలీ, టి. సుబ్బరామిరెడ్డి, సుహాసిని మణిరత్నం, రాధికా శరత్ కుమార్, రానా దగ్గుబాటి, శర్వానంద్, అజారుద్దీన్, చాముండేశ్వరీనాధ్‌ తదితరులు పాల్గొని సంద‌డి చేశారు.

https://youtu.be/USsS_NVWpBk

 

Share post:

Latest