మంచు మ‌నోజ్‌తో గొడ‌వ‌లు..మంచు విష్ణు దిమ్మ‌తిరిగే రిప్లై?!

టాలీవుడ్ క‌లెక్ష‌న్‌ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యులుగా మంచు విష్ణు, మంచు మ‌నోజ్‌ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టారు. వీరిద్ద‌రూ స్టార్ హీరోలు అవ్వ‌లేక‌పోయినా ఇండ‌స్ట్రీలో త‌మ‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం ఈ అన్న‌ద‌మ్ములిద్ద‌రూ సినిమాల‌తో బిజీగా ఉన్నారు.

Where is Manchu Manoj heading? - tollywood

ఇక‌ ప్రొఫెషనల్ లైఫ్ ప‌క్క‌న పెడితే.. మంచు మ‌నోజ్‌, మంచు విష్ణు మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌ని, ఆస్తి విష‌యంలో వీరిద్ద‌రికీ ప‌డ‌టం లేద‌ని గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ విష‌యంలోనే మంచు విష్ణు దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చారు. తాజాగా ఆలీతో సరదా అనే షోలో పాల్గొన్నాడు విష్ణు. తాజాగా ఈ షో ప్రోమోను నిర్వాహ‌కులు విడుద‌ల చేశారు. ఈ షోలో వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తి విష‌యాలెన్నో షేర్ చేసుకున్నాడీయ‌న‌.

Manchu Vishnu is Ready to Drop from Contesting

ఈ క్ర‌మంలోనే ఆలీ.. బయట నీకు, మీ తమ్ముడికి గొడవలు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి.. అందులో నిజమెంత అంటూ నేరుగా విష్ణునే ప్రశ్నించాడు. అందుకే విష్ణు సీరియ‌స్ అవుతూ..మా పర్సనల్ విషయాలు వాళ్లకెందుకు అంటూ రిప్లై ఇచ్చాడు. అంతేకాదు, వేసుకున్న కోటు కూడా విప్పేస్తూ షో నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధ‌మైన‌ట్టు ప్రోమోలో క‌నిపిస్తోంది. ఇక విష్ణు తీరు చూస్తుంటే.. నిజంగానే ఈ అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నాయా..? అన్న సందేహం రాక‌మ‌న‌దు.

Share post:

Latest