`కేజీఎఫ్‌-2` విడుద‌ల‌కు డేట్ లాక్‌..అప్ప‌టిదాకా ఆగాల్సిందే!

కోలీవుడ్ రాక్ స్టార్ య‌శ్‌, స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `కేజీఎఫ్‌-2`. గ‌తంలో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిన కేజీఎఫ్‌-1కు కొన‌సాగింపుగా కేజీఎఫ్-2ని రూపొందించారు. యష్ కి జోడిగా శ్రీనిధి శెట్టి న‌టించ‌గా.. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

KGF Chapter Might Get Postponed Amongst COVID-19 Pandemic – Might now  release on the date of KGF Chapter 1 - Follow Tayeeb | Movie Review,  Kannada, Hindi Celebrity Gossips

విజయ్‌ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ నేప‌థ్యంలో కేజీఎఫ్ 2 ఎప్పెడెప్పుడు విడుద‌ల అవుతుందా అని అంద‌రూ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో ఈ సినిమా విడుద‌ల‌కు లాక్ చేసిన డేట్‌ను తాజాగా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

KGF 2 release delayed; who to play the role of a police officer | Disha  News India

ఈ చిత్రాన్ని 2022 ఏప్రిల్​ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఓ పోస్ట‌ర్ రూపంలో మేక‌ర్స్ వెల్ల‌డించారు. కాగా, ఈ చిత్రం జూలైలోనే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా వ‌ల్ల ప‌రిస్థితులు పూర్తిగా తారుమారు కావ‌డంతో చిత్రాన్ని వాయిదా వేశారు. డిసెంబ‌ర్‌లో విడుద‌ల అవుతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ, మేక‌ర్స్ ఈ సినిమా విడుద‌ల‌ను వ‌చ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేశారు. దీంతో కేజీఎఫ్ 2ను చూడాలంటే వ‌చ్చే ఏడాది వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Popular