ప్ర‌భాస్ `స‌లార్‌`లో ఆ బాలీవుడ్ భామ ఐటెం సాంగ్‌?!

August 2, 2021 at 8:18 pm

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌లార్‌`. ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టిస్తోంది. హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Sky-Rocketing Expectations on Prabhas Salaar Teaser

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర వేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రంలో ఓ అదిరిపోయే మాస్ మ‌సాలా ఐటెం సాంగ్ ఉండ‌నుంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాదు, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఆ సాంగ్ చేస్తుంది వార్త‌లు వ‌చ్చాయి.

Katrina Kaif bursts out laughing mid-dance, aces candid shots in  'photoshoot BTS dump'. Watch | Bollywood - Hindustan Times

అయితే ఇప్పుడు మ‌రో హీరోయిన్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఈ హీరోయిన్ ఎవ‌రో కాదు బాలీవుడ్ భామ కత్రినా కైఫ్. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. స‌లార్ స్పెష‌ల్ సాంగ్ కోసం క‌త్రినాను సంప్రదించడం.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

ప్ర‌భాస్ `స‌లార్‌`లో ఆ బాలీవుడ్ భామ ఐటెం సాంగ్‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts