ఇంట్ర‌స్టింగ్‌గా `విజ‌య్ రాఘ‌వ‌న్‌` ట్రైల‌ర్‌!

August 2, 2021 at 8:00 pm

బిచ్చ‌గాడు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విజ‌య్ ఆంటోని.. తాజా చిత్రం `విజ‌య్ రాఘ‌వ‌న్‌`. ఆనంద కృష్ణన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి. డి. రాజా, డి. ఆర్‌. సంజయ్‌ కుమార్ నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. బస్తీలో పిల్లలకు ట్యూషన్ చెబుతూ ఐఏఎస్ చదివే యువకుడిగా విజయ్ ఆంటోని నటిస్తున్నాడు. రౌడీ గ్యాంగులు, రాజకీయనాయకులు, ఆధిపత్య పోరు, మధ్యలో నలిగిపోయే సామాన్య ప్రజలు, వాళ్లకి మంచి చేయబోయే ప్రయత్నంలో హీరో ఎదుర్కునే పరిణామాలే ఈ సినిమా కథ అని ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది.

`పాడవకుండా ఆధార్ కార్డ్ ని కూడా లామినేషన్ చేసి ఇస్తారు.. కానీ మా జీవితాలను ఎవరూ పట్టించుకోరు` వంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, చేజింగ్ సీన్లు కూడా సినిమాలో ఉన్న‌ట్టు ట్రైల‌ర్ బ‌ట్టీ తెలుస్తోంది. మొత్తానికి ఇంట్ర‌స్టింగ్‌గా ఉన్న ఈ ట్రైల‌ర్ సినిమా మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. మ‌రి దీనిపై మీరూ ఓ లుక్కేసేయండి.

ఇంట్ర‌స్టింగ్‌గా `విజ‌య్ రాఘ‌వ‌న్‌` ట్రైల‌ర్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts