బాల‌య్యకు షాకిచ్చిన జగపతిబాబు..అన్యాయం జరిగిందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!!

సీనియ‌ల్ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జ‌గ‌ప‌తిబాబు.. క్ర‌మ‌క్ర‌మంగా డౌన్ అయిపోయాడు. ఇక సినీ కెరీర్ ముగిసిపోతుంది అనుకుంటున్న త‌రుణంలో బాల‌య్య హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన `లెజెండ్‌` సినిమాలో విల‌న్ పాత్ర పోషించి మంచి క‌మ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా త‌ర్వాత జ‌గ‌ప‌తిబాబు వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.

Jagapathi Babu - Boyapati - Balakrishna -- Once More

స్టైలిష్ మ‌రియు మాసివ్ విల‌న్ రోల్స్ పోషిస్తూ మునుప‌టి కంటే ఎక్కువ‌గా క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం జ‌గ‌ప‌తిబాబు స్టార్ హీరోల‌కు ధీటుగా పాన్ ఇండియా చిత్రాల్లోనూ న‌టిస్తూ దూసుకుపోతున్నారు. ఇలాంటి త‌రుణంలో జ‌గ‌ప‌తి బాబు లెజెండ్‌ మూవీలో త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ బాల‌య్య మ‌రియు డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను షాకిచ్చాడు.

Jagapathi Babu on Balakrishna's Legend Controversy: Bad Timing

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న జ‌గ‌ప‌తిబాబు..`లెజెంట్ సినిమాల నాకు అన్యాయం జ‌రిగింది. ఈ సినిమా ఫైట్ల విషయంల చెప్పింది ఒకటి. చేసింది మరొకటి. అందులో హీరోకు ధీటుగా విలన్ పాత్ర ఉంటుందని చెప్పి నన్ను తీసుకున్నారు. కానీ ఆ స్థాయిలో నా పాత్ర చూపించలేదు` అంటూ చెప్పుకొచ్చాడు జగపతి బాబు. దాంతో ఇప్పుడీయ‌న వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ప్ర‌స్తుతం జగపతి బాబు వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్నరకాలుగా స్పందిస్తున్నారు.