డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు దిల్ రాజు వార్నింగ్‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు దిల్ రాజు వార్నింగ్ ఇవ్వడం ఏంటీ..? అస‌లు ఈయ‌న ఏ విష‌యంలో ఆయ‌న‌కు వార్నింగ్ ఇచ్చాడు..? అన్న సందేహాలు మీకు వ‌చ్చే ఉంటాయి. అది తెలియాలంటే అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. శంక‌ర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో త్వ‌ర‌లోనే ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

- Advertisement -

Ram Charan to play lead in Shankar's next, official announcement to be made  soon - Movies News

ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ న‌టిస్తోంది. అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్నారు. అయితే శంక‌ర్ సినిమాలు అంటే భారీ హంగులు, ఆర్భాటాలు ఉండాల్సిందే. అందువ‌ల్ల‌నే శంకర్ ఏ సినిమా చేసినా.. ముందుగా అనుకున్న బడ్జెట్‌ కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది.

Talk of the Town: Shankar Meets Ram Charan & Dil Raju - Shankar Dil Raju  Ram Charan

ఈ నేప‌థ్యంలోనే శంక‌ర్‌కు దిల్ రాజు ముందుగానే వ‌ర్నింగ్ ఇచ్చార‌ట‌. చ‌ర‌ణ్ మూవీని ముందుగా అనుకున్న బడ్జెట్‌లోనే కంప్లీట్ చేయాలని..ఒకవేళ బడ్జెట్ పెరిగితే శంకర్ రెమ్యునరేషన్‌‌లో కోత విధిస్తాన‌ని దిల్ రాజు ఎలాంటి మొహ‌మాటం లేకుండా చెప్పేశాడ‌ట‌. దాంతో శంక‌ర్ కూడా అనుకున్న బ‌డ్జెట్‌లోనే పకడ్బందిగా ఈ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Share post:

Popular