`గాడ్ ఫాదర్`గా వ‌స్తున్న చిరంజీవి..అదిరిన టైటిల్ పోస్ట‌ర్‌!

మెగాస్టార్ చిరంజీవి, మోహ‌న్ రాజా కాంబోలో లూసిఫ‌ర్ రీమేక్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్ష‌న్స్‌, సూప‌ర్ గుడ్ ఫిలింస్ పతాకాల‌పై ఎన్వీ ప్రసాద్, ఆర్ బి చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లె ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్లింది.

Mohan Raja to direct the Tollywood remake of 'Lucifer' with Chiranjeevi in the lead - The Hindu

అయితే రేపు చిరంజీవి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుద‌ల చేసి కాస్త ముందే మెగా అభిమానుల‌కు ట్రీట్ ఇచ్చింది. ఈ సినిమాకి `గాడ్ ఫాదర్` అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ఎప్ప‌టి నుంచో వార్త‌లు రాగా.. ఇప్పుడు ఈ వార్త‌లే నిజం అయ్యాయి.

Image

లూసిఫ‌ర్ రీమేక్‌కు `గాడ్ ఫాదర్` అనే టైటిల్‌నే ఖ‌రారు చేసిన‌ట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. ఇక టైటిల్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే… కోటు వేసుకుని, టోపి పెట్టుకుని చేతిలో గ‌న్ పెట్టుకుని చిరంజీవి వెన‌క్కి తిరిగి ప‌క‌క్కు చూస్తూ నిట‌బ‌డి ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ టైలిల్ పోస్ట‌ర్ మెగా అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. కాగా, ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తుండ‌గా.. స‌త్య‌దేవ్‌, న‌య‌న‌తార కీల‌క పాత్ర‌లో పోషించ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.