కోట్ల మంది అభిమానులున్న చిరంజీవి ఏ హీరోకు అభిమానో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ప్రాణం ఖరీదు` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు తొలిసారిగా ప‌రిచ‌య‌మైన చిరంజీవి.. ఆ త‌ర్వాత ఒక్కోమెట్టు ఎక్కుతూ మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేక‌పోయినా త‌న‌కున్న ప్ర‌తిభ‌తోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

Chiranjeevi's #153 project launched; to be helmed by Mohan Raja

చిరంజీవి సినీ హీరోగానే కాకుండా రియల్ హీరోగానూ గుర్తింపు పొందాడు. రక్తదానం, నేత్రదానం అంటూ ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారి మదిలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ క్ర‌మంలోనే కోట్లాది మంది ప్రేక్ష‌కుల‌ను త‌న‌ అభిమానులుగా మార్చుకున్న చిరు.. ఓ హీరోకు విరాభిమాని. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు సూప‌ర్ స్టార్ కృష్ణ‌.

Krishna – Telugu Superstar of 1960s-1990s – My Words & Thoughts

అవును, చాలా ఇంట‌ర్వ్యూల్లో సూపర్ స్టార్ కృష్ణకి అభిమానినని, చదువుకునే రోజుల్లో కృష్ణ గారి సినిమాలకు నేలటిక్కెట్ కొనుక్కొని వెళ్లేవాళ్ల‌మ‌ని చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఇక చిరు ఒక్క‌రికే కాదు ఆయ‌న తండ్రి వెంకట్రావు గారికి మ‌రియు త‌మ్మ‌డు నాగ‌బాబుకు కూడా కృష్ణ అంటే ఎంతో అభిమానమట. కాగా, కొత్త అల్లుడు, కొత్త పేట రౌడీ, తోడు దొంగలు సినిమాల్లో కృష్ణ-చిరంజీవి కలిసి నటించారు. మ‌రో విష‌యం ఏంటంటే.. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ కోసం అనుకున్న `ఖైదీ` సినిమానే చిరంజీవి చేసి నటుడిగా మరో మెట్టు ఎక్కాడు.