గెట్ రెడీ..చిరు బ‌ర్త్‌డేకి గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నార‌ట‌?!

ఆగ‌స్టు 22 అంటే మెగా అభిమానులకు ఎంతో ప్ర‌త్యేక‌మైన రోజు. ఎందుకంటే, మెగాస్టార్ చిరంజీవి పుట్టింది ఆ రోజే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. కోట్ల మంది ప్రజలను తన అభిమానులుగా మార్చుకున్న ఘనత చిరు సొంతం. అటువంటి వ్య‌క్తి బ‌ర్త్‌డేను మెగా అభిమానులు ఓ పండ‌గ‌లా సెల‌బ్రేట్ చేసుకుంటుంటారు.

మ‌రోవైపు చిరు బ‌ర్త్‌డేకి ఆయ‌న న‌టిస్తున్న సినిమాల నుంచీ అదిరిపోయే అప్డేట్స్‌ వ‌స్తూ ఉంటాయి. అయితే ఈ సారి కూడా చిరు బ‌ర్త్‌డేకి గ‌ట్టిగానే ప్లాన్ చేశార‌ట‌. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. చిరు బ‌ర్త్‌డేకి `ఆచార్య` రిలీజ్ డేట్‌తో పాటు ఓ గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌నున్నార‌ట‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది

అలాగే చిరు మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో `లూసిఫ‌ర్‌` రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం నిన్న‌నే సెట్స్ మీద‌కు వెళ్లింది. తొలి షెడ్యూల్‌లో చిరంజీవిపై భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఆగ‌స్టు 22న ఈ చిత్రం నుంచి చిరు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది.