లవ్‌స్టోరీకి విలన్‌గా మారుతున్న టక్ జగదీష్

టాలీవుడ్‌లో ఒకేసారి రెండు మూడు సినిమాలు రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద యుద్ధవాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇక చిన్నసినిమాల విషయం పక్కనబెడితే, పెద్ద సినిమాలు ఇలా రిలీజ్ అయితే మాత్రం సినిమా తీసిన వారికంటే కూడా చూసే వారికే ఎక్కువ ఆతృతగా ఉంటుంది. ఏ సినిమా హిట్ కొడుతుందా, ఏ సినిమా బిచానా ఎత్తేస్తుందా అని వారు లెక్కలు వేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మరోసారి కనిపించబోతుంది. అయితే ఈసారి బరిలో ఉన్నవి మాత్రం రెండు మీడియం రేంజ్ సినిమాలు.

ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘లవ్ స్టోరీ’ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా నిరవధికంగా వాయిదా పడింది. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని క్లాస్ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. అటు నేచురల్ స్టార్ నాని బొమ్మ వెండితెరపై చూసి చాలా రోజులు కావడంతో ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’ను ఎలాగైనా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో సినిమాలను రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు ముందుకు వస్తున్నారు.

ఈ క్రమంలోనే సెప్టెంబర్ 10న వినాయక చవితి పండుగ కానుకగా లవ్ స్టోరీ చిత్రాన్ని రిలీజ్ చేయాలని శేఖర్ కమ్ముల భావిస్తున్నాడు. ఫ్యామిలీ మొత్తం చూసే సినిమాలు తీస్తాడనే మార్క్ ఉండటతంతో శేఖర్ కమ్ముల తన సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ధీమాగా ఉన్నాడు. అటు నాని కూడా టక్ జగదీష్ అంటూ ఫ్యామిలీ సబ్జెక్టుతోనే వస్తుండటతంతో ఈ సినిమాను కూడా అదే రోజున రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’కి ‘టక్ జగదీష్’ విలన్‌గా మారుతాడా.. లేక టక్ జగదీష్‌ను కాదని ఆడియెన్స్ శేఖర్ కమ్ముల లవ్ స్టోరీకే ఓటేస్తారా అనేది చూడాలి.

Share post:

Latest