న‌యా రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్..ఉబ్బిత‌బ్బిపోతున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌డా ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ సొంత టాలెంట్‌తో స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకున్నాడు బ‌న్నీ. అంతేకాదు.. త‌న‌దైన అందం, న‌ట‌న‌, డ్యాన్స్‌, స్టైల్ ఇలా అన్నిటితోనూ ఎంద‌రో ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానుల‌గా మార్చుకున్నారు.

Image

ఇక బ‌న్నీకి సోష‌ల్ మీడియాలోనూ ఫాలోయింగ్ ఎక్కువే. ఈ క్ర‌మంలోనే బ‌న్నీ ఖాతాలో ఓ న‌యా రికార్డ్ వ‌చ్చి ప‌డింది. తాజాగా బ‌న్నీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఫాలోవ‌ర్స్ సంఖ్య 13 మిలియ‌న్ల‌కు చేరుకుంది. అంటే కోటి 30 లక్షల మంది ఫాలోయర్స్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. సౌత్ ఇండస్ట్రీలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో ఈయనే కావడం విశేషం.

Image

అలాగే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తెరిచిన నాలుగేళ్లలోనే బ‌న్నీ ఈ ఘనత అందుకోవడం మ‌రో విశేషంగా చెప్పుకోవ‌చ్చు. ఇక ఈ విషయాన్ని బన్నీ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తనను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు తన అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. దాంతో ఆయ‌న ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బిత‌బ్బిపోతున్నారు. కాగా, బ‌న్నీ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది.

Share post:

Popular