సూప‌ర్ కాంబో..హరీష్‌ శంకర్ తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌..?!

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తో లైగ‌ర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ అనన్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే పూర్తి కానుంది.

అయితే ఈ చిత్రం త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, పుష్ప రెండు భాగాలుగా వ‌స్తుండ‌డంతో.. సుకుమార్ ఇప్ప‌ట్లో ఫ్రీ అయ్యే ఛాన్స్ లేదు. అందుకే ఈలోపు మ‌రో డైరెక్ట‌ర్‌తో సినిమా చేయాలని విజ‌య్ భావిస్తున్నాడ‌ట‌.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. హ‌రీష్ శంక‌ర్‌తో విజ‌య్ నెక్ట్స్ సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ మ‌ధ్యే విజ‌య్‌కు హ‌రీష్ ఓ ప‌వ‌ర్ ఫుల్ క‌థ చెప్ప‌గా.. అది ఆయ‌న‌కు బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే ఒకే చెప్పాడ‌ట‌. అంతేకాదు, వీరి కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రాన్ని దిల్ రాజు నిర్మించ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాలంటే.. అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

Share post:

Latest