డైరెక్ట‌ర్‌గా మారుతున్న ప్ర‌ముఖ స్టార్‌ క‌మెడియ‌న్‌..?!

ప్ర‌ముఖ స్టార్‌ క‌మెడియ‌న్ వెన్నెల కిషోర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వెన్నెల సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈయ‌న‌.. మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించ‌డంలో వెన్నెల కిషోర్ మ‌హా దిట్ట‌.

- Advertisement -

ఇక ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ క‌మెడియ‌న్‌గా మారిపోయిన ఈయ‌న‌.. త్వ‌ర‌లోనే ద‌ర్శ‌కుడిగా మార‌బోతున్నాడ‌ట‌. అయితే ఈయ‌న డైరెక్ట్ చేయ‌బోయేది సినిమాలు కాద‌ని.. వెబ్ సిరీస్ అని తెలుస్తోంది. మ‌రో విష‌యం ఏంటంటే..వెన్నెల కిషోర్ డైరెక్ట్ చేయబోతున్న వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ గా వెన్నెల కిశోరే నటిస్తోన్నాడట.

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వ‌నుంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు రానున్న‌ట్టు స‌మాచారం. కాగా, ప్ర‌స్తుతం వెన్నెల కిషోర్ ఆచార్య‌, ఒకే ఒక జీవితం, స్టాండ‌ప్ రాహుల్, బింబిసార‌ ఇలా ప‌లు చిత్రాల్లో న‌టిస్తున్నాడు.

 

Share post:

Popular