వెంకీ-కమల్‌ హాసన్ మ‌ల్టీస్టార‌ర్‌..డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా?

ఈ మ‌ధ్య కాలంలో మ‌ల్టీస్టార‌ర్ సినిమాల హ‌వా బాగా పెరిగి పోయింది. స్టార్ట్ హీరోలు సైతం ఎలాంటి ఇగోల‌కు పోకుండా మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చేయ‌డానికి ఇంట్ర‌స్ట్ చూపుతున్నారు. ప్రేక్ష‌కుల‌కూ ఇటువంటి చిత్రాల‌పై మ‌క్కువ ఎక్కువే. ఇలాంటి త‌రుణంలో మ‌రో మ‌ల్టీస్టార‌ర్ చిత్రం తెర‌పైకి వ‌చ్చింది.

విక్ట‌రీ వెంక‌టేష్‌, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ల‌తో త్వ‌ర‌లోనే ఓ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్క‌నుంద‌ని ఓ వార్త నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇంత‌కీ వీరి కాంబోను సెట్ చేసింది ఎవ‌రో కాదు.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల. తాజాగా నార‌ప్ప సినిమాతో వెంకీ ఖాతాలో మ‌రో హిట్ ప‌డేలా చేసిన‌ శ్రీకాంత్ అడ్డాల..ఎప్ప‌టి నుంచో ఈ మ‌ల్టీస్టార‌ర్‌ను చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ట‌.

కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ ఆల‌స్యం అవుతూనే ఉంద‌ట‌. అయితే ఈసారి మాత్రం శ్రీ‌కాంత్ అడ్డా సీరియస్‌గానే ట్రయల్స్ మొదలు పెట్ట‌గా.. అటు క‌మ‌ల్‌, ఇటు వెంకీ ఇద్ద‌రూ మ‌ల్టీస్టార‌ర్ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్రచారంలో ఎంత వ‌ర‌కు నిజ‌ముంతో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే. కాగా, వెంకీ..క‌మ‌ల్ ఈనాడు చిత్రంలో క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే.

Share post:

Latest