తెర‌పైకి మ‌రో మల్టీస్టారర్..లైన్‌లోకి అక్కినేని-మెగా హీరోలు!

ఈ మ‌ధ్య కాలంలో తెలుగు చిత్ర‌ ప‌రిశ్ర‌మ‌లో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల హ‌వా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు సోలో చిత్రాలు చేస్తూనే..మరోవైపు మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నారు స్టార్‌ హీరోలు. అయితే తాజాగా మ‌రో మ‌ల్టీస్టార‌ర్ తెర‌పైకి వ‌చ్చింది.

టాలీవుడ్ లో బడా ఫ్యామిలీలైన మెగా, అక్కినేని యంగ్ హీరోలు క‌లిసి ఓ మ‌ల్టీస్టారర్ చేయ‌బోతున్నార‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా దర్శకరచయిత దశరథ్ ఓ చిత్రం తెర‌కెక్కింబోతున్నాడ‌ట‌.

దశరథ్ ఇటీవ‌ల‌ ఓ మల్టీస్టారర్ స్క్రిప్ట్ రెడీ చేసి.. వ‌రుణ్‌, చైతుల‌కు వినిపించాడ‌ట‌. అది బాగా న‌చ్చ‌డంలో వెంట‌నే సినిమా చేసేందుకు ఒకే చెప్పార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

Share post:

Popular