నాగ్‌ బ్యానర్‌లో వైష్ణ‌వ్ తేజ్‌ మూవీ..రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్‌బ్లాకే!?

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణ‌వ్ ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే నాగార్జున సొంత బ్యాన‌ర్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో వైష్ణ‌వ్ ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

స్పోర్ట్స్‌ నేపథ్యంలో సాగే ఈ మూవీలో వైష్ణవ్‌ హాకీ ఆటగాడిగా కనిపించనున్నాడట. ఈ మూవీతో పృథ్వీ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు వైష్ణ‌వ్ రెమ్యున‌రేష‌న్ హాట్ టాపిక్‌గా మారింది. వినిపిస్తున్న తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రానికిగానూ వైష్ణ‌వ్‌కు నాగ్ ఏకంగా రూ. 5 కోట్లు పారితోష‌కంగా ఇస్తున్న‌ట్లు స‌మాచారం.

మ‌రి ఇందులో ఎంత నిజ‌ముందో ప‌క్క‌న పెడితే.. నెట్టింట మాత్రం ఈ వార్త తెగ వైర‌ల్ అవుతోంది. కాగా, ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానున్నాయి.

Share post:

Popular