బ‌న్నీ కోసం బ‌రిలోకి దిగ‌నున్న సన్నీలియోన్..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?!

స‌న్నీ లియోన్‌.. ఈ భామ‌కు దేశ‌వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పోర్న్‌ స్టార్‌గా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన స‌న్నీ.. ఆ త‌ర్వాత బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే త్వ‌ర‌లోనే ఈ అందాల తార‌.. తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో ఓ అదిరిపోయే స్పెష‌ల్ సాంగ్ ఉంద‌ని.. ఆ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్‌ను తీసుకోనున్నార‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఆ స్పెష‌ల్ సాంగ్ కోసం స‌న్నీ లియోన్‌ను బ‌రిలోకి దింప‌నున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే ఇటీవలె పుష్ప యూనిట్ స‌న్నీని సంప్ర‌దించ‌గా.. ఆమె కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ని వార్త‌లు వ‌స్తున్నారు. మ‌రి ఇదే నిజ‌మైతే.. ఆమె ఫ్యాన్స్‌కు పండ‌గే అంటున్నారు సినీ ప్రియులు.

Share post:

Latest