శ్రుతి హాసన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తక్కువు సమయంలో తెలుగు ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. క్రాక్, వకీల్ సాబ్ వంటి భారీ హిట్లను ఖాతాలో వేసుకుని మంచి జోష్‌లో ఉంది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ సరసన సలార్‌తో పాటుగా.. మరికొన్ని ప్రాజెక్ట్స్‌లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రుతి.. తాజాగా అభిమానులతో లైవ్ ఛాట్ నిర్వహించింది.దాంతో అభిమాను, నెటిజన్లు వృత్తిపరమైనవే కాకుండా వ్యక్తిగతమైన విషయాలను కూడా టచ్ చేస్తూ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన్ మీ ముక్కు అంటే మీకు ఇష్టమా? అని ప్రశ్నించారు.
సదరు వ్యక్తి ఏ ఉద్దేశంతో అడిగాడో తెలిమదుగానీ.. అందుకు శ్రుతి మాత్రం ఆసక్తికర సమాధానం ఇచ్చింది. అవును నాకు ముక్కు అంటే ఇష్టమే.. దాని కోసమేగా చాలా డబ్బులు ఖర్చు అయింది అంటూ రిప్లై ఇచ్చింది. కాగా, శృతి ముక్కు మొదట్లో కొంత తేడాగా ఉండడంతో.. ఆమె ముక్కుకి కాస్మెటిక్ సర్జరీ చేయించుకొంది. అయినా సెట్ కాకపోవడంతో మళ్ళీ లండన్ వెళ్లి లక్షలు ఖర్చు పెట్టి సర్జరీ చేయించుకొంది. ఈ విషయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా ఓపెన్‌గానే చెప్పడం విశేషం.