పోలిస్ స్టేష‌న్‌లో ఎన్టీఆర్‌..విడిపించిన రామ్‌చ‌ర‌ణ్‌?!

పోలీస్ స్టేషన్‌లో ఎన్టీఆర్ ఏంటీ..? రామ్ చ‌ర‌ణ్ విడిపించ‌డ‌మేంటీ..? అనేగా మీ సందేహం.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్‌. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం కోసం యావత్ భారతదేశం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది.

RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ ఫోటో వైరల్.. భీమ్‌ని విడిపించిన రామరాజు.. ఈ సన్నివేశం ఎప్పుడు అంటూ ఫ్యాన్స్‌లో ఆసక్తి - Ram charan ,ntr ,rajamouli, RRR movie new photo goes ...

ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రాం భీమ్‌గా, చ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామ‌రాజుగా క‌నిపించ‌నున్నారు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ ఫొటోలో ఎన్టీఆర్ ను పోలిస్ స్టేష‌న్‌లో కట్టేసి ఉంచ‌గా.. ఈయ‌న్ను విడిపించేందుకు రామ్ చరణ్ వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.

Jai NTR (@tarakntr999) | Twitter

ప్ర‌స్తుతం ఈ ఫొటోను అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌, ఇటు చ‌ర‌ణ్ ఫ్యాన్స్ తెగ వైర‌ల్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ఆలియా భ‌ట్‌, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తుంటే..అజ‌య్ దేవ‌గ‌ణ్‌, శ్రియ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అలాగే ఈ పాన్ ఇండియా మూవీకి ఎంఎం కీరవాణి స్వరాలు స‌మ‌కూర్చుతున్నారు.