ప్ర‌భాస్ మూవీలో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన రెజీనా!

ప్ర‌భాస్ సినిమాలో హాట్ బ్యూటీ రెజీనా కసండ్రాకు బంప‌ర్ ఆఫ‌ర్ ద‌క్కింది. కానీ, ఇక్క‌డే ట్విస్ట్ ఉంది. మ్యాట‌ర్ ఏంటంటే..రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబోలో తెర‌కెక్కిన ఛత్రపతి చిత్రం బాలీవుడ్‌లోకి రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

- Advertisement -

15 Years for Prabhas and Rajamouli Chatrapathi

ఈ చిత్రం ద్వారానే బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. అయితే ఈ రీమేక్ చిత్రంలో మొద‌ట కియారా అద్వానీని హీరోయిన్ అనుకున్నారు. కానీ, ఆమె వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా ఉండ‌టంతో.. రెజీనాను ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల రెజీనాను సంప్ర‌దించ‌గా.. ఆమె వెంట‌నే ఓకే చెప్పేసిన‌ట్టు స‌మాచారం.

Hindi remake of Prabhas' Chatrapathi launched, SS Rajamouli claps first  shot; see pics - Hindustan Times

కాగా, 2018లో ఎక్ లడకీ కో దేఖాతో ఐసా లగా చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రెజినా.. ఆ త‌ర్వాత మ‌రో హిందీ చిత్రం చేయ‌లేదు. మ‌ళ్లీ లాంగ్ గ్యాప్‌ త‌ర్వాత ప్ర‌భాస్ మూవీ రీమేక్‌తో రెజీనా బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది.

Share post:

Popular