`పుష్ప‌` షూటింగ్‌కు మ‌ళ్లీ బ్రేక్‌..ఏం జ‌రిగిందంటే?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం పుష్ప‌. లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పుష్పరాజ్‌గా క‌నిపించ‌నున్నాడు.

Pushpa still leaked, Allu Arjun fans love his rustic look - Movies News

క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా ఆగిపోయిన పుష్ప పార్ట్ 1 షూటింగ్‌.. మ‌ళ్లీ ఇటీవ‌లె హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అల్లు అర్జున్, ర‌ష్మిక ఇత‌ర తార‌లు కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారు. అయితే లేటెస్ట్ స‌మాచారం.. ఇప్పుడు మ‌ళ్లీ పుష్ప షూటింగ్‌కు బ్రేక్ ప‌డిన‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నారు.

Pushpa'' shooting is halted after twelve crew members tested positive for  COVID-19? | Telugu Movie News - Times of India

గత కొన్ని రోజులుగా హైదరాబాద్‏లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పుష్ప షూటింగ్ స్పాట్ తీవ్రంగా దెబ్బతిన్నదట. దాంతో కొన్ని రోజుల పాటు షూటింగ్‌ను నిలిపి వేశార‌ట మేక‌ర్స్‌. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది. కాగా, పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రిమూవీ మేకర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఫాహద్‌ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నారు.

 

Share post:

Popular