ఆ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో వంట‌ల‌క్క‌..నెట్టింట న్యూస్ వైర‌ల్‌!

కార్తీక‌దీపం సీరియ‌ల్ ద్వారా వంట‌ల‌క్క‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయింది ప్రేమీ విశ్వనాథ్‌. త‌న స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఎంద‌రో అభిమానుల‌ను కూడా సంపాదించుకున్న ఈ బ్యూటీకి.. హీరోయిన్ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందంటే అతిశ‌యోక్తి కాదు.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు బుల్లితెర‌పై ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఈ భామ‌.. త్వ‌ర‌లోనే వెండితెర‌పై ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ట‌. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాతో అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుస్వామి కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

Ram, Lingusamy to begin shoot from July 12

కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళంలోనూ రూపుదిద్దుకోనుంది. అయితే ఈ చిత్రంలో వంటలక్క ఓ కీల‌క పాత్ర పోషించ‌బోతోంద‌ని ఈ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వార్త వైర‌ల్ కావ‌డానికి కారణం కూడా లేకపోలేదు. తాజాగా వంటలక్క.. డైరెక్టర్‌ లింగుస్వామిని కలిశానంటూ ఓ ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ నేప‌థ్యంలోనే రామ్ సినిమాలో వంట‌ల‌క్క ఉంటుంద‌ని ప్ర‌చారం ఊపందుకుంది.

Share post:

Popular